హైవేలపై బోర్డులు గ్రీన్‌ కలర్‌లోనే ఎందుకుంటాయో తెలుసా?

  • ప్రశాంతతను ఇచ్చే రంగుగా గ్రీన్‌ కలర్‌కు గుర్తింపు
  • ఎరుపు, పసుపు రంగులు డ్రైవర్ల దృష్టిని మళ్లిస్తాయి
  • దూరాల వివరాల కోసం పచ్చ రంగు బోర్డులు
  • ప్రకృతిలో గ్రీన్‌ కలర్‌ సులభంగా కలుస్తుంది
  • సురక్షిత ప్రయాణానికి దోహదం చేసే ఆకుపచ్చ రంగు
మీరు ఎప్పుడైనా హైవేలపై ప్రయాణించినప్పుడు రోడ్డు పక్కన లేదా పైన ఉండే బోర్డులను గమనించే ఉంటారు. నగరాల దూరాలు, రోడ్డు భద్రతా నియమాలను తెలిపే ఈ సైన్ బోర్డులు దాదాపుగా ఆకుపచ్చ రంగులోనే ఉంటాయి. భారత్‌లో కొన్ని చోట్ల నీలం రంగు బోర్డులు కూడా కనిపిస్తాయి. కానీ ఎక్కువగా గ్రీన్‌ కలర్‌నే ఎందుకు వాడతారో తెలుసా?

సాధారణంగా డ్రైవర్లను రోడ్డుపై అలర్ట్ చేయడానికి ఎరుపు, పసుపు రంగులను వాడుతుంటారు. తప్పు దారి లేదా ఆగండి వంటి అత్యవసర హెచ్చరికల బోర్డులను ఎరుపు రంగులో పెడతారు. అయితే హైవేలపై ఇలాంటి రంగుల బోర్డులు ఎక్కువగా ఉంటే డ్రైవర్ల దృష్టి మళ్లుతుంది. అందుకే దూరాన్ని తెలిపే సమాచార బోర్డులకు ఆకుపచ్చ రంగును ఎంచుకున్నారు.

గ్రీన్ కలర్‌ కళ్లకు ప్రశాంతతను ఇచ్చే, దృష్టిని మరల్చని రంగుగా పరిశోధనల్లో తేలింది. అమెరికాలోని అరిజోనా రవాణా శాఖ దీనిపై ప్రత్యేకంగా పరిశోధనలు చేసింది. ఆకుపచ్చ రంగు బోర్డులు చుట్టుపక్కల ఉండే ప్రకృతిలో సులభంగా కలిసిపోతాయి. దీనివల్ల డ్రైవర్లు ఎలాంటి ఆందోళన లేకుండా ప్రయాణంపై మాత్రమే పూర్తి శ్రద్ధ పెట్టగలుగుతారు.

Highway Signboards
Green Road Signs
Road Safety Rules
Driving Focus
Arizona Transportation Research
Highway Navigation

More Telugu News